శ్రీ రామ నవమి, ఓయు కాలనీ , Shaikpet

01 ఏప్రిల్ 2012 అనగా నిన్న OU కాలనీ Shekpet లో వెలసినటువంటి లక్ష్మణ సామెత శ్రీ సీతా రామచాచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. పగలు 10 గంటలకు పున్యవచనం తో ప్రారంభమైన కార్యక్రమము వివిధ రకాల విధుల తో సాగుతూ దేవేరులకు మధ్యాహ్నం 12 .30 కి వేద మంత్ర ఘోషల నడుమ వేద పండితులు జీల కర్ర బెల్లం తలపై పెట్టారు. వివాహమునకు స్వామి వారు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యారు ... " అలంకార ప్రియో విష్ణుః " అంటారు ... అనగా విష్ణు మూర్తి అలంకర ప్రియుడు ... వారిని ఎంతగా అలంకరిస్తే అంట ఆనందిస్తారు స్వామివారు.




అలా ముస్తాబైన స్వామి మరియు సీతా మాత వివాహ ప్రక్రియ 1 .30 కు పూర్తి అయినది. వివాహమునకు సిద్ధముగా నున్న దేవేరులను కింది ఫోటోలలో చుడండి.


వివాహమునకు సన్నద్దమైన లక్ష్మణ సామెత శ్రీ రామ చంద్రమూర్తి 

రాముల వారిని ఓర కంట చూస్తున్న సీత మహా సాధ్వి 
పరిణయ ముహూర్తం కొద్దిగా వీడియో తీసాను ... స్పష్టముగా రాకున్నను దానిని ఈ ప్రచురణలో పొందు పరుస్తున్నాను .... చూసి తరించండి  ...




అందరు ఉచ్చ స్వరంతో ఎలుగెత్తి చెప్పండి ....




జై శ్రీ రామ్ ..... జై జై శ్రీ రామ్ ....

రామచంద్ర భగవాన్ కి  .... జై ....

రామ లక్ష్మణ జానకి .... జై బోలో హనుమాన్ కి .....

Comments

  1. రామచంద్ర భగవాన్ కి .... జై ....

    రామ లక్ష్మణ జానకి .... జై బోలో హనుమాన్ కి .....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Namaste Sada Vatsale - RSS Prayer

Miklós Fehér - Soccer player who died during the match

Lord Sri Krishna Photos and Wallpapers