Small Request to Kejrival

ఏమండి కేజ్రివాల్ గారు ... మీరేమో ఎవరో ఒకరిమీద బురద చల్లడం ... ఈ వెధవ టీవీ చానెళ్ళ వాళ్ళు కొందరు పనికి మాలిన ... వెధవలను కూర్చోబెట్టి ఇంక ఏ విషయము లేనట్టు దాని గురుంచి ఒక గంట చర్చించడం తర్వాత వదిలెయ్యడం ...

Aravind Kejrival

మీరు వెంట వెంటనే అందరి పైన కాకుండా .. ఒక్కొక్కళ్ళ భాగోతాలు బయటపెట్టి శిక్ష పడ్డాక వేరే వాళ్ళ పైకి వెళ్ళాలి ... మొన్న వాద్రా అన్నారు .... దాని పైన ఎటువంటిది తేలకముందే సల్మాన్ ఖుర్షిద్ పైన ఆరోపణలు .... అదీ ఎటు తేలక ముందే గట్కరి పైనా ఆరోపణలు ... అంటే మీరు కేవలం ఆరోపణలు చేసి వదిలేస్తే నిజం బైట పడుతుందా ?

దుర్మార్గులకు లంచాగొండులకు అవినీతిపరులకు శిక్ష పడుతుందా ??? కొంచం ఆలోచించండి ... ఒక పక్క ప్రణాళిక అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు ... జాగ్రత్త ...

ఇవన్ని ఇలాగె కొనసాగితే చివరికి మాకు మీ మీద కూడా నమ్మకం పోతుంది ... ఆరోపణ చెయ్యడం ... బురద చల్లడం ఈజీ ... దాన్ని నిరూపించడం కష్టం ... అది నిరూపించి శభాష్ అనిపించుకోండి ... ఈ అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టండి .... 

Comments

Popular posts from this blog

Namaste Sada Vatsale - RSS Prayer

Miklós Fehér - Soccer player who died during the match

Lord Sri Krishna Photos and Wallpapers